పాలమూరులో ప్రాజెక్టులకే ప్రాధాన్యం..ఉమ్మడి జిల్లాకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఉమ్మడి

Update: 2024-07-26 02:32 GMT

దిశ,మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఉమ్మడి పాలమూరు జిల్లా నీటి వనరుల నిర్వహణ, మరమ్మతుల కోసం నిధులను కేటాయించింది. ఈ నిధుల ద్వారా సంవత్సర కాలం పాటు ప్రధాన నీటి వనరుల మరమ్మతులు, నిర్వహణ కోసం నిధుల కేటాయింపులను చేసింది. ఇందులో భాగంగా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కు 1,285 కోట్ల రూపాయలను కేటాయించారు. భీమ ప్రాజెక్టు కోసం 13.94 కోట్లు, ఆర్డీఎస్ కు 40 కోట్లు, జూరాలకు 13 కోట్లు , నెట్టెంపాడుకు 105 కోట్లు, కల్వకుర్తికి 715 కోట్లు, ఆర్డీఎస్ కు 29 కోట్ల రూపాయలు కేటాయించారు. కొత్త ప్రాజెక్టు సర్వేల కోసం మూడు కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రాజెక్టుల నిర్వహణకు, వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిధులను కేటాయించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ఎత్తిపోతల పథకాలకు ప్రాధాన్యతను ఇవ్వనుంది.

కొత్త మండలాలకు కార్యాలయాలు

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పడిన మండలాలకు ఇప్పటివరకు సొంత కార్యాలయాలు లేవు. కార్యాలయాల నిర్మాణానికి గాను రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించిన నేపథ్యంలో అద్దె భవనాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలలో నిర్వహించబడుతున్న మండల, తహసీల్దార్ ఇతర ముఖ్యమైన అధికారుల కార్యాలయాల నిర్మాణానికి మార్గం సుగమం అయింది.

విద్య, వైద్య, ఉపాధి రంగాలు..

ప్రభుత్వం విద్యా వైద్య ఉపాధి రంగాలకు ప్రాథమికని ఇస్తూ నిధులు కేటాయించడం తో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అవసరమైన చోట్ల డిగ్రీ, ఇంటర్ కళాశాలల ఏర్పాటు, సొంత బిల్డింగుల నిర్మాణాలు జరగనున్నాయి. ఇప్పటికే మంజూరు కాబడి అద్దె భవనాలలో కొనసాగుతున్న విద్యాసంస్థలకు సొంత భవనాలు నిర్మించుకోవడానికి అవకాశాలు కలుగునున్నాయి.

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఊరట..

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఊరటను కల్పించనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులుగా పనిచేసిన వారికి గౌరవ వేతనాలు కొన్ని నెలల పాటు అందలేదు. గౌరవ వేతనాల కోసం ప్రభుత్వం బడ్జెట్ లో నిధులను కేటాయించడంతో ఇటీవలనే పదవీ విరమణ చేసిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ఉపశమనం కలగనుంది. గతంలో వివిధ అభివృద్ధి పనులు చేసినప్పటికీ వారికి బిల్లులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతూ వచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆ నిధులను కేటాయించేందుకు చర్యలు తీసుకోవడంతో మాజీ ప్రజాప్రతినిధులు మాజీ సర్పంచుల బాధలు కొంతమేర తీరని ఉన్నాయి.

Tags:    

Similar News