ప్రముఖ జానపద గాయకుడు జంగారెడ్డి కూతురు ఆత్మహత్య

ప్రముఖ జానపద గాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ జానపద గాయకుడు జంగారెడ్డి చిన్న కూతురు స్ఫూర్తి 17 ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

Update: 2024-10-03 16:49 GMT

దిశ, జడ్చర్ల : ప్రముఖ జానపద గాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ జానపద గాయకుడు జంగారెడ్డి చిన్న కూతురు స్ఫూర్తి 17 ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జానపద గాయకుడైన జంగారెడ్డి బిజినపల్లి మండలం మహదేవుని పేట గ్రామం కాగా జడ్చర్ల పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో సొంతంగా ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. జంగారెడ్డి కి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఓ కూతురు కర్నూల్లో ప్రవేట్ జాబ్ చేస్తుండగా..చిన్న కూతురు స్ఫూర్తి జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాలలో చదువుతుంది. బుధవారం పండుగ సందర్భంగా.. వారి సొంత గ్రామమైన మహాదేవుని పేటకు వెళ్లి సాయంత్రం తిరిగి జడ్చర్లకు చేరుకున్నారు. ఈ క్రమంలో రాత్రి ఒకటి గంటల ప్రాంతంలో స్ఫూర్తి ఇంట్లోనే బెడ్రూంలో తన చున్నీతో ఫ్యాన్ కు ఉరివేసుకొని చనిపోయింది. స్ఫూర్తి ఆత్మహత్యకు గల కారణాలు తెలియదని ఈ ఘటనపై తండ్రి జంగారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని..దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై మల్లేష్ తెలిపారు.


Similar News