రైతు పండుగలో నేటి కార్యక్రమాలు
భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తా పూర్
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తా పూర్ గ్రామ శివారులో మూడు రోజులపాటు రైతు పండుగ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, పలు అంశాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10 గంటల నుండి 10:45 వరకు కూరగాయల పంటల ఉత్పత్తిపై రాజేంద్రనగర్ కూరగాయల పరిశోధన కేంద్రం ప్రిన్సిపాల్ డాక్టర్ అనిత కుమారి 10:45 నుండి 11 గంటల వరకు పండ్ల తోటల సాంకేతికత పై సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ వి. సుచిత్ర అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఉదయం 11 నుంచి 11:45 వరకు పూల తోటలకు సంబంధించిన సాంకేతిక ఉత్పాదకత సాంకేతికతపై డాక్టర్ జి. జ్యోతి ,రాజేంద్రనగర్ ఫ్లోరికల్చర్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు.మధ్యాహ్నం 12 గంటల నుండి 12: 20 వరకు ఆయిల్ ఫామ్ తోటల పై హార్టికల్చర్ శాఖ అదనపు డైరెక్టర్ వి .సరోజినీ దేవి ,మధ్యాహ్నం 12:20 నుండి 12:40 వరకు ఆర్కే వి వై హార్టికల్చర్ జాయింట్ డైరెక్టర్ బాబు, మధ్యాహ్నం 12:40 నుండి ఒకటి వరకు ఉద్యాన సాగు, ఆయిల్ పామ్ తోటల ఉత్పత్తి సాంకేతికత అంశాలపై హర్టికల్చర్ జాయింట్ డైరెక్టర్ కె .రామలక్ష్మి రైతులకు అవగాహన కల్పించనున్నారు . భోజన విరామం అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు లైవ్ స్టాక్ సీడింగ్ మేనేజ్మెంట్ పై ప్రొఫెసర్ ఏ. నరసింహ, రెండున్నర నుండి మూడు గంటల వరకు లైవ్ స్టాక్ ఉత్పత్తి పై వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానం పై ప్రొఫెసర్ కిషన్ కుమార్, 3 నుండి 3:30 వరకు డైరీ , గొర్రెలు, మేకలు రూరల్ బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ ఏర్పాటు గురించి మహబూబ్ నగర్ వెటర్నరీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి. శివానంద స్వామి, సాయంత్రం 3:30 నుంచి 4:00 వరకు పశువులకు సోకే వ్యాధులు, ముందు జాగ్రత్త చర్యలపై డాక్టర్ బి. మమత, అలాగే నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు కాంపోజిట్ ఫిష్ కల్చర్ పై మెళకువలు అనే అంశంపై డాక్టర్ బి. లక్ష్మప్ప వనపర్తి మత్స్యశాఖ అధికారి అవగాహన కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
మంత్రులు ఉత్తం, పొన్నం రాక..
రైతు పండగలో భాగంగా రెండో రోజు శుక్రవారం జరిగే కార్యక్రమాలకు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరుకానున్నారు. మధ్యాహ్నం 12:30 గంటల తర్వాత నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరై వ్యవసాయ స్టాల్ల్స్ ను సందర్శించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమాలను పరిశీలిస్తారు. ఈ కార్యక్రమాల అనంతరం మంత్రి ఉత్తం ఉమ్మడి జిల్లా పౌరసరఫరాలు, సాగునీటి శాఖ అధికారులతో కలెక్టరేట్ సమావేశం మందిరంలో జరిగే సమీక్ష సమావేశాలకు హాజరవుతారు. పొన్నం ప్రభాకర్ నాగర్ కర్నూల్, కొల్లాపూర్ లో జరిగే కార్యక్రమాలలో పాల్గొంటారు.