DK Aruna : దేవరకద్ర రైల్వే గేట్ సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం

త్వరలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ హామీ ఇచ్చారు.

Update: 2024-09-24 09:29 GMT

దిశ, దేవరకద్ర: త్వరలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ హామీ ఇచ్చారు. మంగళవారం దేవరకద్ర మండల కేంద్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ స్థానిక బీజేపీ నేతలు ,వ్యాపారులతో కలిసి దేవరకద్రలోని రైల్వే గేట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ… ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు, ఇతర పనుల కోసం కూలీలు, సామాన్య ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారని, గత కొన్నేళ్లుగా స్థానిక ప్రజలు రైల్వే గేటు దాటేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. స్థానికుల ఇబ్బందులను రైల్వే శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా అండర్ బ్రిడ్జి నిర్మాణం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి కొత్త కాపు నారాయణరెడ్డి, మండల బీజేపీ అధ్యక్షుడు కృష్ణంరాజు,బీజేపీ నాయకులు దేవన్నసాగర్ ,నాగిరెడ్డి, రాచాల రాజు, వ్యాపారులు హరికాంత్ , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


Similar News