గత పాలకులు ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు: మంత్రి

గడిచిన పదేళ్లలో గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే..సీఎం రేవంత్ రెడ్డి రోజుకు 18 గంటలు శ్రమిస్తున్నాడని మంత్రి కొండా సురేఖ అన్నారు.

Update: 2024-10-07 13:04 GMT

దిశ, అచ్చంపేట : గడిచిన పదేళ్లలో గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే..సీఎం రేవంత్ రెడ్డి రోజుకు 18 గంటలు శ్రమిస్తున్నాడని మంత్రి కొండా సురేఖ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. శ్రీ ఉమామహేశ్వర ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆలయ చైర్మన్ గా మాధవరెడ్డి తో పాటు.. 16 మంది డైరెక్టర్లను,ఆలయ అధికారులను ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా.మంత్రి మాట్లాడుతూ..గత పాలకులు ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారన్నారు..ఆదాయ వనరుగా ఉన్న రాష్ట్రం అప్పుల ఉబిలోకి నెట్టింది వారి పాపమే అన్నారు. పదవులనేటివి అందరికీ రావని వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఏ నాయకుడు కూడా అధికారం రాగానే ప్రజలను విస్మరించరాదన్నారు. బిఆర్ఎస్ నాయకులు రాష్ట్ర అభివృద్ధికి మీ వంతు మంచి సలహా ఇవ్వాలి..ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేసీఅర్ హరీష్ రావులను ఉద్దేశించి మండిపడ్డారు. కావాలని అధికార పార్టీ పై బురద చల్లే పనిలో ఉన్నారని విమర్శలు చేశారు. గత పాలకులు సంక్షేమ పథకాల పేరుతో కాలేశ్వరం, మిషన్ భగీరథ పథకాలతో 15 వందల కోట్ల రూపాయలను టిఆర్ఎస్ పార్టీ ఖాతాలో జమ చేసుకున్నారని ఆరోపించారు. వారి తప్పుడు విధానాల వల్లనే రాష్ట్రం ఆర్థికంగా కొట్టుమిట్టాడుతుందన్నారు. మిగిలింది అంతా బోడ గుండె అన్నారు. రానున్న లోకల్ బాడీ.ఎన్నికల్లో ప్రభుత్వం అమలు చేసే పథకాలు గడప గడపకు తీసుకెళ్లి ..మన సీఎం రేవంత్ రెడ్డి ప్రజల కోసం 18 గంటలు పని చేస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. నల్లమల  హబ్ గా మార్చేందుకు నా వంతు పూర్తి సహకారం అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

త్వరలో 11 వేల ఉపాధ్యాయ పోస్టులు

గడిచిన 10 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే 40 వేల ఉద్యోగ పోస్టులు భర్తీ చేసిందన్నారు. త్వరలోనే మరో 11 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తుందని, నిరుద్యోగులకు వీలైనన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కోరిన విధంగా ఆలయం వద్ద గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం నా ప్రత్యేక నిధుల నుంచి నిధులు కేటాయిస్తాmalన్నారు. అలాగే రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ.. అచ్చంపేట ప్రాంతంలో క్రీడాభివృద్ధికి ప్రత్యేకంగా నా సహకారం అందించి ఎన్టీఆర్ స్టేడియాన్ని అన్ని అంగులతో అభివృద్ధి చేసేందుకు తగినన్ని నిధులు కేటాయిస్తానన్నారు.

ఎమ్మెల్యే సమస్యలను మంత్రి దృష్టికి..

ఈ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ.. నల్లమల్ల ప్రాంతం టూరిజం హబ్ గా మార్చేందుకు 16 టూరిజం కేంద్రాలు ఉన్నాయన్నారు. అన్ని అటవీ ప్రాంతంలో ఉండడంతో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని వాటిని పరిష్కరించాలన్నారు. ఆరు లక్షల హెక్టార్లలో నల్లమల్ల అడవి ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గంలోనే ఉందని, ఒకరోజు సమయం ఇచ్చి టూరిజం అభివృద్ధి కోసం పర్యటించాలని మంత్రిని కోరారు. అన్నదాన సత్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు 50 లక్షలు, కళ్యాణ మండపం కోసం కోటి నిధులు అవసరం ఉందన్నారు. ఓల్డ్ గెస్ట్ హౌస్ పునరుద్ధరణ కోసం 25 లక్షలు కేటాయించాలని, వివిధ సమస్యలను ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.


Similar News