పార్లమెంట్ ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వర్తించాలి : జిల్లా కలెక్టర్

కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని, పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేలా కృషి చేయాలని నాగర్ కర్నూల్ కలెక్టర్‌ పీ. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

Update: 2024-03-12 11:47 GMT

దిశ, నాగర్ కర్నూల్ కలెక్టరేట్ : కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని, పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేలా కృషి చేయాలని నాగర్ కర్నూల్ కలెక్టర్‌ పీ. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నాగర్ కర్నూల్ పార్లమెంట్‌ ఎన్నికల సంసిద్ధతపై నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల అదనపు కలెక్టర్లు, మూడు జిల్లాల 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని సహాయ రిటర్నింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు దిశ నిర్దేశం చేశారు. అధికారులందరూ వారికి కేటాయించిన విధులను, బాధ్యతలను భారత ఎన్నికల సంఘం, ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్వర్తించాలన్నారు. నూతన ఓటర్ల నమోదు ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించడం, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్‌‌లు, కుమార్ దీపక్, కె సీతారామారావు, గద్వాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అపూర్వ్ చౌహన్, వనపర్తి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గాంగ్వార్, వనపర్తి రెవెన్యూ అదన కలెక్టర్ నగేష్‌, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


Similar News