Sridhar Babu: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే మా బాధ్యత

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం మా బాధ్యతయని ,వారిని అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సుల శిక్షణతో ఉన్నతంగా తీర్చిదిద్ది భవిష్యత్తుకు బంగారు బాట వేస్తామని రాష్ట్ర ఐటి,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు.

Update: 2024-10-25 12:36 GMT

 దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం మా బాధ్యతయని ,వారిని అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సుల శిక్షణతో ఉన్నతంగా తీర్చిదిద్ది భవిష్యత్తుకు బంగారు బాట వేస్తామని రాష్ట్ర ఐటి,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu)  అన్నారు. జిల్లా కేంద్రం పిల్లలమర్రి రోడ్డులోని ఐటిఐ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం 9.48 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత బాలుర,బాలికల అధునాతన సాంకేతిక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ భవనానికి ఆయన శంకుస్థాపన చేసి ప్రసంగించారు. రాబోయే రోజుల్లో అధునాతనమైన టెక్నాలజీతో కొత్త పరిశ్రమలు విస్తరించబోతున్నాయని,సాంకేతిక పరిజ్ఞానం,డిసిప్లిన్ అంతా ఐటీఐ స్థాయి నుంచే మొదలు కావాలనే ఉద్దేశ్యంతో ఈ టెక్నాలజీ కోర్సుల శిక్షణ తరగతులు ప్రారంభించాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళుతున్నామని అన్నారు. జాతీయస్థాయిలో మరిన్ని బహుళ జాతి కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు పూర్తి స్థాయిలో కలుగుతాయని,ఆ క్రమంలోనే రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున 65 ప్రభుత్వ ఐటీఐ కళాశాలలతో ముందుకు వెళ్ళుతున్నామని ఆయన అన్నారు. పారిశ్రామిక రంగానికి సంబంధించిన విద్యను అనుసంధానం చేసే కార్యచరణ తీసుకపోతూ..పెద్ద ఎత్తున అడుగులు వేస్తున్నామన్నారు. ఇటీవల 28 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యంగ్ ఇండియా,అలాగే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి శంకుస్థాపన చేస్తూ.. ఉన్నత విద్యను ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి కార్యాచరణలో ముందుకు వెళుతున్నామని,10 నెలలోనే నెలకు 5 వేల ఉద్యోగాల చొప్పున 50 వేల ఉద్యోగాలు ఇప్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 40 వేల ఉద్యోగాలు కూడా చేపట్టలేదని ఆయన విమర్శించారు. పేద విద్యార్థులు చదువుతున్న ఐటీఐ ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకురావాలనే మంచి లక్ష్యంతో,పాలమూరు జిల్లా యావత్తు రాష్ట్రానికి ఒక ఆదర్శంగా నిలబడే ఈ కార్యక్రమం చేపట్టిన శాసనసభ్యుడు యెన్నం శ్రీనివాస్ రెడ్డి అభినందనీయుడని ఆయన కొనియాడారు.

ఆరు కోర్సులతో మొదలు కాబోతున్నాయి...

జిల్లా కేంద్రంలో రూపొందిస్తున్న ఐటీఐ కళాశాలలో ఆరు కోర్సులు టాటా ప్రాజెక్టు వారితో డిజైన్ చేసిన కోర్సులని,ఇవి ఒకటి,రెండు సంవత్సరాల కోర్సులని ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి ( MLA yennam Srinivas రెడ్డి ) అన్నారు. శిక్షణ పూర్తి చేసిన బాలికలకు కంపెనీ వారే వచ్చి ఉద్యోగాలు ఇస్తారని, ట్రైనింగ్ ఎక్విప్మెంట్ మొత్తం కూడా ప్రైవేటు,పబ్లిక్ భాగస్వామ్యంతో.. ప్రభుత్వం టాటా ప్రాజెక్టు వారి నైపుణ్య సెంటర్ ను ఇక్కడ నెలకొల్పుతూ ఉన్నామని ఆయన వివరించారు. గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో అప్పటి ఐటీ మంత్రికి ట్విట్టర్ లో పోస్టులు,పేపర్లో పెద్ద పెద్ద హెడ్డింగులే కావాలని విద్యార్థుల నైపుణ్యతను పెంచే ద్యాస లేకుండేనని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూధన్ రెడ్డి,మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి,షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ ఒబెదుల్లా కొత్వాల్, మున్సిపల్ చైర్మెన్ ఆనంద్ గౌడ్, టి పీసీసీ ప్రధాన కార్యదర్శులు వినోద్ కుమార్, సంజీవ్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ అనిత తదితర నాయకులు పాల్గొన్నారు.


Similar News