Congress : ప్రజాప్రతినిధులారా సెలవుల్లో పర్యటించకండి..

ప్రభుత్వ సెలవు దినాల్లో, ఆదివారాలలో మంత్రులు, ప్రజాప్రతినిధులు పర్యటించకండని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు మెరపెట్టుకుంటున్నారు.

Update: 2024-08-04 13:06 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : ప్రభుత్వ సెలవు దినాల్లో, ఆదివారాలలో మంత్రులు, ప్రజాప్రతినిధులు పర్యటించకండని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు మెరపెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుసగా సెలవులు, ప్రతి ఆదివారం కూడా అధికారిక పర్యటనలు ఉంటున్నాయని, ఒక్కరోజు కూడా మా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం లేదని, తమ పిల్లలు, తల్లితండ్రుల ఆలనాపాలనా చూసుకునే సమయం కూడా దొరకడం లేదని, స్వంత అవసరాలు, ఇంటి పనులు కూడా చేసుకోలేక సతమతమవుతున్నామని కొందరు అధికారులు వాపోయారు. వారం రోజులు పని చేస్తే ఒకరోజు సెలవు ఉంటుందని, ఆ ఒక్క రోజు కూడా మంత్రులు అధికారిక పర్యటనలు ఉంటే మాకు విశ్రాంతి అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ప్రజాప్రతినిధులు ఆలోచించి ప్రభుత్వ ఉద్యోగుల సెలవు రోజుల్లో పర్యటించకండని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు విన్నవించుకుంటున్నారు.

Tags:    

Similar News