Jadcherla : జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్‌పై నెగ్గిన అవిశ్వాసం
జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీపై సొంత
దిశ, జడ్చర్ల : జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మీపై సొంత పార్టీ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం గురువారం నెగ్గింది. దీంతో జడ్చర్ల తొలి మున్సిపల్ చైర్పర్సన్ అయిన దోరేపల్లి లక్ష్మి చైర్ పర్సన్ పదవిని కోల్పోయారు. జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ పై బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు తమ సొంత పార్టీకి చెందిన మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో ఆర్డిఓ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో అవిశ్వాస బల నిరూపణ సమావేశాన్ని ఏర్పాటు చేశారు జడ్చర్ల మున్సిపాలి 27 మంది కౌన్సిలర్లకు కాను చైర్పర్సన్ మినహా 26 మంది కౌన్సిలర్లు అవిశ్వాస సమావేశానికి హాజరై చైర్పర్సన్ కు వ్యతిరేకంగా 26 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి అనుకూలంగా తమ చేతులను ఎత్తి మద్దతు తెలిపారు దీంతో చైర్పర్సన్ లక్ష్మీపై పెట్టిన అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీవో నవీన్ కుమార్ ధృవీకరించారు దీంతో కౌన్సిలర్లు ఒక్కసారిగా కౌన్సిలర్ల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ సమావేశం నుంచి బయటకు వచ్చారు. జడ్చర్ల మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత తొలి పాలకవర్గంలొనే అవిశ్వాస తీర్మానం పెట్టి చైర్మన్ ను పదవి నుంచి తొలగించడంతో నూతన చైర్ పర్సన్ ఎన్నిక పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అవిశ్వాసం పెట్టడంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్.. జడ్చర్లలో బీఆర్ఎస్..
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ చైర్పర్సన్ లపై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టి చైర్ పర్సన్ లను పదవుల నుంచి దింపి మున్సిపాలిటీలను హస్తగతం చేసుకుంటుండగా జడ్చర్లలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లే తమ పార్టీకి చెందిన చైర్పర్సన్ పై అవిశ్వాసం పెట్టి అవిశ్వాసం పెట్టి మరి దింపిన జడ్చర్ల మున్సిపల్ లో జరగడంతో అంతా చర్చనీయాకంగా మారింది.
చైర్పర్సన్ భర్త పై అసంతృప్తితోనే..
జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ దొరేపల్లి లక్ష్మి భర్త ఆయన దోరేపల్లి రవీందర్ ఏకపక్ష నిర్ణయాలతో ఒంటెద్దుడు ఒకడలో వల్లనే మున్సిపల్ పరిధిలోని 26 మంది కౌన్సిలర్లు ఒకటై చైర్పర్సన్ పై అవిశ్వాసం పెట్టి అవిశ్వాసంలో ఏకంగా 26 మంది ఏకపక్షంగా అవిశ్వాసానికి అనుకూలంగా ఓట్లు వేసి మరి చేరిన పదవి నుంచి దింపేశారు దీంతోనే చైర్పర్సన్ భర్త పై కౌన్సిలర్లకు ఉన్న అసంతృప్తి ఏపాటిదో అర్థమవుతుంది.
త్వరలోనే చైర్మన్ ఎన్నుకుంటాం : కౌన్సిలర్లు
మాజీ చైర్ పర్సన్ భర్త దోరేపల్లి రవీందర్ ఆగడాలను భరించలేకనే 26 మంది కౌన్సిలర్ల అందరం ఐక్యంగా అవిశ్వాస తీర్మానం పెట్టి మరి చైర్పర్సన్ ను పదవి నుంచి దింపేశామని త్వరలోనే మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సూచనల మేరకు కౌన్సిలర్ల అందరి ఏకాభిప్రాయంతో నూతన చైర్పర్సన్ ను ఎన్నుకొని జడ్చర్ల మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని జడ్చర్ల మున్సిపల్ కౌన్సిలర్లు తెలిపారు.