న్యూ లైఫ్ హాస్పిటల్ ను సీజ్ చేయాలి…ఆసుపత్రి ముందు అఖిలపక్ష నేతల ధర్నా

తీవ్ర జ్వరంతో బాధపడుతూ వైద్యం కోసం వచ్చిన ఓ మహిళపై ఆర్ఎంపీ డాక్టర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన నాగర్ కర్నూల్

Update: 2024-09-19 15:07 GMT

దిశ నాగర్ కర్నూల్ :- తీవ్ర జ్వరంతో బాధపడుతూ వైద్యం కోసం వచ్చిన ఓ మహిళపై ఆర్ఎంపీ డాక్టర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని న్యూ లైఫ్ హాస్పిటల్ లో బుధవారం చోటు చేసుకోగా గురువారం బాధితురాలు నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ లో ఆర్ఎంపీ డాక్టర్ పై ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో బాధితురాలికి మద్దతుగా రెడ్డి సంఘం నేతలు, కాంగ్రెస్, బిజెపి , సిపిఎం, సిపిఐ, బీఎస్పీ, నేతలు ఆసుపత్రి ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు మాట్లాడుతూ.... ఇలాంటి అర్హత లేకున్నా నకిలీ ఎంబీబీఎస్ పత్రాలను సృష్టించి హాస్పిటల్ నడుపుతున్న ఆర్ఎంపీ డాక్టర్ సమీర్ ను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

గతంలో ఈ హాస్పిటల్ లో ఇద్దరు వ్యక్తులు చనిపోయిన కొన్ని రోజులు హాస్పిటల్ తూతూ మంత్రంగా సీజ్ చేసి మళ్లీ తెరిపించుకున్నారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వచ్చి హాస్పిటల్ ను సీజ్ చేసేంతవరకు మేము ఆందోళన విరమించమని ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ప్రజాసంఘాల నాయకులకు ఆర్ఎంపీ డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చి హాస్పిటల్ మూసివేసి ఆందోళన విరమింప చేశారు.

ఈ విషయం పై నాగర్కర్నూల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కనకయ్యని వివరణ కోరగా ఆర్ఎంపీ డాక్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆర్ఎంపీ డాక్టర్ పై 354(A), 509 సెక్షన్ల పై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.


Similar News