MP DK Aruna : దేశ విభ‌జ‌న పాపం మొత్తం కాంగ్రెస్ దే..

ప్రధాని ప‌ద‌వి కాంక్ష‌తో నెహ్రూ వేసిన త‌ప్ప‌డ‌గులు నేటికీ భారత

Update: 2024-08-14 14:31 GMT

దిశ, గద్వాల ప్రతినిధి : ప్రధాని ప‌ద‌వి కాంక్ష‌తో నెహ్రూ వేసిన త‌ప్ప‌డ‌గులు నేటికీ భారత దేశానికి మాన‌ని గాయాల‌ను రేపుతోంద‌ని, దేశ విభజన పాపం మాత్రం కాంగ్రెస్ దేనని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ తెలిపారు. బుధవారం ఆమె నివాసం లో ఏర్పాటు చేసిన మేధావుల సదస్సు లో దేశ విభజన గాయల స్మారక దినం పేరిట జరిగిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... భారత దేశం స‌ర్వ‌మ‌త స‌మ్మేళ‌నం, భిన్న‌త్వంలో ఏక‌త్వంగా ఉన్న దేశాన్ని ఆనాడు ప్ర‌ధాని కావడానికి నెహ్రూ ప‌ద‌వీ వ్యామోహం తో దేశాన్ని రెండు ముక్కలుగా విడ‌గొట్టేందుకు ఒప్పుకున్నార‌ని ఆమె తెలిపారు.

ఆగ‌స్టు 14 వ తేదీ ఎంతో మందికి గాయాలు మిగిల్చిన రోజ,ఎంతో మంది ఈ దేశం కోసం పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించారని ఆమె గుర్తు చేశారు. ముస్లిం లీగ్, మతోన్మాద శక్తులు చేసిన అరాచకాలు దేశ విభజన సమయం లో మారణహోమం సృష్టించరని లక్షల మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రాణ భయం తో దేశ విభజన సమయంలో వలస వచ్చారని ఆమె తెలిపారు. సంస్కృతిక ఆనవాలు ఇప్పటికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో ఉన్నాయని కానీ అక్కడి హిందువులు ఇప్పటికే స్వతంత్రంగా జీవించడం లేదని ఇప్పటికి ఆ దేశం లో హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఆమె అన్నారు.

విదేశీ సిద్ధాంతాలను అనుసరిస్తున్న కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు ఈ దేశ సమైఖ్యతను ఏనాడూ గౌరవించలేదని, ఈ దేశ చరిత్రను గుర్తు చేసుకుంటూ యువత మేధావులు నేటి తరానికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె మేధావులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు,అసెంబ్లీకి పోటీ చేసిన అభ్యర్థులు బలి గేర శివా రెడ్డి, రాజగోపాల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మిర్జాపూర్ రామచంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షుడు బండల వెంకట రాములు, బిజెపి సీనియర్ నాయకుడు మధుసూదన్ తదితరులు ఉన్నారు.


Similar News