కుల గణనను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి... ఎమ్మెల్యే

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న సమగ్ర సామాజిక ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులాల సర్వే పై శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ నిర్వహించారు.

Update: 2024-11-02 10:58 GMT

దిశ, అచ్చంపేట : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న సమగ్ర సామాజిక ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులాల సర్వే పై శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సర్వేలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడోయాత్రలోనే కుల గణన పై స్పష్టమైన ప్రకటన చేశారని, సామాజిక న్యాయం కోసం ఆయన కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని, ప్రజలందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అప్పుడే మనం అనుకున్న సామాజిక న్యాయం ప్రతి ఒక్కరికి దక్కుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు కుల గణన పైన సందేహాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో గార్లపాటి శ్రీనివాసులు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ లాయర్ రాజేందర్, డాక్టర్ మోపతయ్య, కట్ట గోపాల్ రెడ్డీ, మాజీ ఎంపీపీ రామనాథం, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నాయకులు విభాగాల చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు, సీనియర్ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

Tags:    

Similar News