MLA Vakiti Srihari : అనుచిత వ్యాఖ్యలు మానుకోండి
అసలు విషయం తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు
దిశ, మక్తల్: అసలు విషయం తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ పై బీజేపీ రాష్ట్ర నాయకులు భాస్కర్ అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అరాచకాలపై ముందుగా స్పందించిన నేత రాహుల్ గాంధీ అన్న విషయం తెలుసుకోవాలని గుర్తు చేశారు. ఉట్కూర్ మండల కేంద్రంలో ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారిపై బీజేపీ రాష్ట్ర నాయకులు భాస్కర్ గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
బాధ్యతాయుతమైన నాయకుడిగా నిజానిజాలు తెలుసుకోకుండా ఆ విధంగా మాట్లాడం సరికాదని అన్నారు. దేశ అభివృద్ధి కొరకు భారత ప్రభుత్వంతో కలిసి కృషి చేస్తున్న రాహుల్ గాంధీ లాంటి మహా నేతపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ప్రస్తుతం దేశాన్ని కాపాడాల్సిన భారత ప్రభుత్వమే ఎలాంటి చర్యలు తీసుకోకుండా, ప్రతిపక్షంలో ఉన్న వారిపై ఇలాంటి మాటలు అనడం ఎంతవరకు తగునని, వెంటనే తను చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు.