ఆరోపణలు వద్దు సలహాలు ఇవ్వండి.. ఎమ్మెల్యే శ్రీహరి..

సామాజిక మాధ్యమంలో తన పై లేనిపోని ఆరోపణలు చేయకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం సలహాలు ఇవ్వండి అన్నారు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.

Update: 2024-07-07 10:54 GMT

దిశ, మక్తల్ : సామాజిక మాధ్యమంలో తన పై లేనిపోని ఆరోపణలు చేయకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం సలహాలు ఇవ్వండి అన్నారు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. అలాగే తన రాజకీయ జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉందని, అధిష్టానంలో ఉన్న ప్రధాన నాయకులకు తన క్యారెక్టర్ గురించి తెలుసుకొని అన్నారు. ఆదివారం మధ్యాహ్నం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశానికి హాజరై మాట్లాడుతూ తన ప్రమేయం లేకుండానే సామాజిక మాధ్యమాల్లో ఓ వర్గాన్ని కించపరిచినట్టుగా పోస్టులు పెట్టినట్టు క్రియేట్ చేయడం తగదన్నారు.

నియోజకవర్గం, ప్రాంత అభివృద్ధి గూర్చి అన్ని వర్గాల నాయకులతో కలిసి పనిచేసే తత్వం తనదని, కొందరు తన ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక సామాజిక మాధ్యమంలో లేనిపోని పోస్టులు పెట్టి ఇబ్బంది కలగజేస్తున్నారని అన్నారు. నియోజక వర్గం అభివృద్ధి కోసం సలహాలు స్వీకరించేందుకు గాను ఎవరు ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తానన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన రెండు వారాలకే ప్రధాన సమస్యను పరిష్కరించేందుకు నిధులు మంజూరు చేయించుకొన్న తొలి ఎమ్మెల్యేగా రాష్ట్రంలోనే పేరు ఉందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు గణేష్, లక్ష్మారెడ్డి, చంద్రకాంత్ గౌడ్, కోల వెంకటేష్, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.


Similar News