ఎన్నికల ప్రచార రథం సిద్ధం చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి..

వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సీ లక్ష్మారెడ్డి ప్రచార రథాన్ని సిద్ధం చేశారు.

Update: 2023-04-03 10:19 GMT

దిశ, జడ్చర్ల: వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సీ లక్ష్మారెడ్డి ప్రచార రథాన్ని సిద్ధం చేశారు. ఎన్నికలకు మరో ఎనిమిది నెలలు ఉన్నప్పటికీ ఆయన ముందస్తుగా కొత్తగా వాహనాన్ని కొని, పెద్ద మొత్తంలో ఖర్చు చేసి ప్రచారానికి అనువుగా రూపొందింపజేశారు. ప్రచార రథాన్ని సిద్ధం చేస్తున్న నిపుణులు సోమవారం రాజాపూర్ మండల కేంద్రంలో జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం వద్దకు రథాన్ని తీసుకొచ్చారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తదితరులు ప్రచార రథాన్ని పరిశీలించి పలు మార్పులు చేర్పుల కోసం సూచనలు చేశారు. ఎన్నికల కోసం ఎమ్మెల్యే ముందుగా తయారు చేయించిన రథాన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు.

Tags:    

Similar News