Minister Jupally : రైతులకు సాగునీటి ఇబ్బందులు రానివ్వదు
సాగునీటి కాలువలలో అడ్డుగా ఉన్న జమ్మును, పేరుకుపోయిన
దిశ, వీపనగండ్ల: సాగునీటి కాలువలలో అడ్డుగా ఉన్న జమ్మును, పేరుకుపోయిన ఒండ్రు మట్టిని తొలగించేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం పానుగల్ మండల పరిధిలోని రేమద్దుల, కిష్టాపూర్,గోప్లాపూర్ గ్రామాల శివారులలో ఉన్న కేఎల్ ఐ డి8 కాలువను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ రైతులకు సాగునీటి కష్టాలను రానివ్వ వద్దని, కాలువలలో పేరుకుపోయిన ఒండ్రు మట్టి, జమ్మును తొలగించేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
కాలువలలో సాగునీరు ముందుకు పారేలా రైతులు సహకరించాలని ఆయన కోరారు.రైతులకు సాగునీరు అందించే విషయంలో శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలను సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు,మాజీ జడ్పీటీసీ రవికుమార్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవర్ధన్ సాగర్,రాము యాదవ్,పుల్లారావు,బ్రహ్మం, ఇరిగేషన్ అధికారులు వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.