Minister Jupalli Krishna Rao : కురుమూర్తి స్వామి ఆలయం అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా..
కురుమూర్తి స్వామి ఆలయ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
దిశ, చిన్నచింతకుంట : కురుమూర్తి స్వామి ఆలయ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం పర్యాటక స్టడీ టూర్ లో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో ఎంపీ మల్లు రవి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలో వెలసిన శ్రీ కురుమూర్తి స్వామి వారిని ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు దర్శించుకొని ప్రత్యక్ష పూజలు చేశారు. అనంతరం కురుమూర్తి ఆలయం ముఖమండపం ముందు భాగంలో మహామండపం నిర్మాణం లిఫ్ట్ మార్గం ఏర్పాటు, రెండు అంతస్తులతో కూడిన అన్నదాన సత్రం, కళ్యాణ మండపం, భక్తులకు దాసంగాల షడ్స్, టాయిలెట్స్, పలు భక్తుల సాకర్యార్థం అభివృద్ధి కార్యక్రమాలు గురించి మంత్రి జూపల్లి కృష్ణారావుకి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఈవో మదనేశ్వర్ వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ నెంబర్ చల్లావంశీచంద్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, మెగా రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, వాకిటి శ్రీహరి, కృష్ణమోహన్ రెడ్డి, సరిత తిరుపతయ్య, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఆర్డీఓ నవీన్, అధికారులు కాంగ్రెస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ప్రతాపరెడ్డి, ప్రదీప్ రెడ్డి, గంజి బాలరాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.