మాగనూరు ఘటనలో ఎంఈఓ, ఇంచార్జిల పై సస్పెన్షన్ వేటు..

నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురి అయిన సంఘటనకు బాధ్యులపై అధికారులు చర్యలు చేపట్టారు.

Update: 2024-11-21 04:31 GMT

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో/మక్తల్ : నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురి అయిన సంఘటనకు బాధ్యులపై అధికారులు చర్యలు చేపట్టారు. ఎంఈఓ మురళీధర్ రెడ్డి, సంఘటన జరిగే సమయంలో ఇన్చార్జిగా ఉన్న బాబు రెడ్డిని సస్పెండ్ చేయడంతో పాటు.. వంట ఏజెన్సీలను రద్దు చేస్తూ బుధవారం రాత్రి ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం.

ఫుడ్ పాయిజన్ అయ్యి వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం.. అందులో 16 మంది పరిస్థితి విషమంగా ఉండడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల పై సీరియస్ అయ్యారు. ఈ మేరకు సీఎంఓ ఆదేశాలతో అధికారులు బాధ్యుల పై చర్యలు చేపట్టారు. సంఘటనకు సంబంధించి గురువారం పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు.


Similar News