ఐకేపీ సెంటర్లలో భారీగా చోరీలు..
ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాల్లో కమిషన్ ఇస్తేనే ధాన్యాన్ని కాంట
దిశ,పెంట్లవెల్లి : ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాల్లో కమిషన్ ఇస్తేనే ధాన్యాన్ని కాంట చేస్తున్నారని ఐకేపీ మహిళా సంఘాలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంట్లవెల్లి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ దగ్గర ధాన్యం వచ్చి పది రోజులైనా కాంటాలు చేయడం లేదని ఎవరు కమిషన్ ఇస్తే వాళ్లకి మాత్రమే ముందుగా కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తేమశాతం 17% మ్యాచ్ వస్తే కొనుగోలు చేయాలని చెప్పగా, ఐకేపీ సెంటర్ల ద్వారా మహిళా సంఘాలు మాత్రం 14% నిర్వహించి రైతుల నోట్లో మన్ను కొడుతున్నారని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని,అధికారులకు కూడా కమిషన్ ముడుతుందేమని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.