స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పెద్ద మొత్తంలో సర్పంచులను గెలిపించుకొని, జిల్లాలో సత్తా చాటాలని రాష్ట్రబీజేపీ రాష్ట్ర కోశాధికారి బండరీ శాంతికుమార్ అన్నారు.
దిశ, మక్తల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పెద్ద మొత్తంలో సర్పంచులను గెలిపించుకొని, జిల్లాలో సత్తా చాటాలని రాష్ట్రబీజేపీ రాష్ట్ర కోశాధికారి బండరీ శాంతికుమార్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం మక్తల్ పడమటి ఆంజనేయ స్వామి తిరుణాల ఉత్సవాల సందర్భంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి ప్రాణేషచారి శాలువాలు కప్పి సన్మానించారు. కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని స్థానిక ఎన్నికల గెలుపులో స్థానిక నాయకుల పనితీరుకు నిదర్శనమని అన్నారు. బూత్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, పార్టీలోని కార్యకర్తలు నాయకులు అందరూ కలిసికట్టుగా అభ్యర్థుల విజయానికి కృషి చేసి అత్యధిక పంచాయతి సర్పంచులు గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ పెట్ అసెంబ్లీ ఇంచార్జి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంతంగా పాండురెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామయ్య గౌడ్, రాష్ట్ర సోషల్ మీడియా జాయింట్ కన్వీనర్ మఠం మయుర్నాథ్, భాస్కర్, కౌకుంట్ల ఆంజనేయులు, మక్తల్ కౌన్సిలర్ రాంమాధవ్, మంజునాథ్, పూల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.