ప్రయాణికుల మర్యాద దినోత్సవం
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నందుకు అభినందనలు అని మహబూబ్ నగర్ డిపో మేనేజర్ సుజాత అన్నారు.
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నందుకు అభినందనలు అని మహబూబ్ నగర్ డిపో మేనేజర్ సుజాత అన్నారు.శుక్రవారం 'ప్రయాణికుల మర్యాద దినోత్సవం' సందర్భంగా స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ లోని బస్సుల్లోకి ఆమె ఎక్కి,ప్రయాణిస్తున్న ప్రయాణికులకు చాక్లెట్,పుష్పాలు ఇచ్చి అభినందించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం పట్ల భద్రత,సౌకర్యం,సురక్షితం ఉంటుందనే నమ్మకంతో..తమ సేవలు వినియోగించుకోవడం పట్ల ఆమె కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఎం రాంజీ,బిఎస్.రెడ్డి,యాదమ్మ,ఆంజనేయులు,తదితరులు పాల్గొన్నారు.