రైస్ మిల్లర్లకు ఇచ్చిన ధాన్యాన్ని సకాలంలో అందించాలి

రైస్ మిల్లర్లకు ఇచ్చిన ధాన్యాన్ని సకాలంలో అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆదేశించారు

Update: 2024-12-20 15:41 GMT

దిశ, గద్వాల కలెక్టరేట్ : రైస్ మిల్లర్లకు ఇచ్చిన ధాన్యాన్ని సకాలంలో అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆదేశించారు. శుక్రవారం ఐడిఓసి లోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో రైస్ మిల్లర్ల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రబీ సీజన్ 2022-23 సంబంధించిన ధాన్యాన్ని వేలం దార్లకు కి అప్పగించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర నుండి ఫిలిప్పైన్స్ కు ఎగుమతి చేయబడే ధాన్యంను వేలం వేసిన ధాన్యం నుండి 5% నూకతో బియ్యంని సివిల్ సప్లై శాఖకు అందజేయాలన్నారు. ఖరీఫ్ -2024-25 కు సంబంధించిన సిఎం ఆర్ ను వెంటనే డెలివరీ చేయాలని సూచించారు. ఖరీఫ్- 2024- 25 కు మిల్లర్లు ఇచ్చిన బ్యాంకు గ్యారెంటీ గడువు పూర్తి అయినందున ఇప్పటికీ ఇవ్వని వారు త్వరగా అందజేయాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో డిఎస్ఓ స్వామి కుమార్, జిల్లా మేనేజర్ విమల, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.


Similar News