రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మండల పరిధిలోని ధర్మవరం స్టేజి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది.
దిశ,ఎర్రవల్లి: మండల పరిధిలోని ధర్మవరం స్టేజి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కోదండపురం ఎస్సై స్వాతి , స్థానికుల వివరాల మేరకు..కర్నూలు ప్రాంతానికి చెందిన పసుల జయకృష్ణ ( 28 )శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుతున్నాడు. ఈ క్రమంలో హైదరాబాదు నుంచి కర్నూలు కి వెళుతున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో..జయ కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరి పసుల శ్రీవాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కోదండాపూర్ ఎస్ఐ తెలిపారు.