త్వరలో సరిహద్దుపై శాశ్వత పరిష్కారం
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల పరిధిలోని తూర్పు గార్లపాడు ఇసుక రీచ్ దగ్గర సరిహద్దుపై వివాదం నెలకొంది.
దిశ, రాజోలి : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల పరిధిలోని తూర్పు గార్లపాడు ఇసుక రీచ్ దగ్గర సరిహద్దుపై వివాదం నెలకొంది. ట్రాక్టర్ యజమానులు మాట్లాడుతూ..తెలంగాణ సరిహద్దులో ఇసుకను తీసుకున్న, ఏపీకి చెందిన కొంతమంది కర్రలతో దాడి చేయడానికి వస్తున్నారని వాపోయారు. ఈ సమస్యపై శుక్రవారం జాయింట్ కలెక్టర్ లక్మి నారాయణ స్వయంగా నది మధ్యలో ఉన్న సరిహద్దులను పరివేక్షించారు. జాయింట్ కలెక్టర్ లక్మి నారాయణ, కర్నూలు జిల్లా కలెక్టర్ తో కలిసి అక్కడి పరిస్థితులపై చర్చించుకున్నారు. గూగుల్ మ్యాప్ ఆధారంగా సంయుక్తంగా జాయింట్ సర్వే చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నది మధ్యలో రాష్ట్రాల సరిహద్దులను ఏర్పాటు చేసి..బౌండరీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అంతవరకు సరిహద్దు వరకు ట్రాక్టర్లు వెళ్ళ వద్దని ట్రాక్టర్ యజమానులకు సూచించారు. కార్యక్రమంలో మైనింగ్ AD BV రమణ, MRO రామ్ మోహన్, డీఎస్పీ కే సత్యనారాయణ, సీఐ టాటా బాబు, ఎస్ఐ జగదీష్, కర్నూలు తాలూకా SI రామాంజనేయులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.