బతుకమ్మ సంబరాల్లో అపశృతి

గద్వాలలోని రేవులపల్లిలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో అపశృతి జరిగింది డీజే సౌండ్ విషయంలో ఆర్మీజవాన్, మరో వ్యక్తికి మధ్య జరిగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

Update: 2024-10-08 06:09 GMT

దిశ, గద్వాల క్రైం: సౌండ్ చేయకు కంఠం కోస్తా.. ఇదేదో సినిమా డైలాగ్ లా ఉంది కదూ. అందుకు భిన్నంగా సహనం కోల్పోయిన ఓ వ్యక్తి.. ఆర్మీ జవాన్ పై కత్తి తో దాడి చేయగా.. ఈ దాడిలో ఆర్మీ జవాన్ కు తీవ్రగాయాలయ్యాయి‌. వివరాల్లోకి వెళ్లితే.. ధరూర్ మండలం రేవులపల్లి గ్రామంలో సోమవారం రాత్రి బతుకమ్మ సంబరాల సందర్బంగా ఉత్సవాలు నిర్వహించేందుకు కాలనీలో మహిళలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బతుకమ్మ పాటలతో ఉత్సాహంగా తమ మహిళలు బతుకమ్మ ఆడుతూ నిమగ్నమై ఉన్నారు. ఆ ఇంటి పక్కనున్న కృష్ణ అనే యువకుడు మైక్ సౌండ్ బంద్ చేయాలని వారితో వాగ్వివాదానికి దిగాడు. అక్కడ ఉన్నవారు సంబురాలు అయ్యాక పాటలు బంద్ చేస్తారు అని‌ నచ్చ చెప్పినా వినలేదు.

సౌండ్ ఆపుతారా లేదా అని వాగ్వివాదానికి దిగి స్థానికులపై దాడికి పాల్పడాడు ఆర్మీ జవాన్. గొడవ కాస్తా పెద్దది కావడంతో అదే కాలనీలో నివాసం ఉంటున్న ఆర్మీ జవాన్ మణివర్దన్ అక్కడి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేయడానికి యత్నించాడు. సహనం కోల్పోయిన కృష్ణ ఆర్మీ జవాన్ పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆర్మీ జవాన్ తీవ్రంగా గాయపడగా, చికిత్స కోసం గద్వాల ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆర్మీ జవాన్ ను మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ కు తరలించారు. దాడికి పాల్పడిన కృష్ణ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై గద్వాల సీఐ నాగేశ్వర్ రెడ్డిని వివరణ కోరగా.. గొడవ జరిగింది‌ వాస్తవమే, దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామన్నారు.


Similar News