గద్వాల తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున్

గద్వాల మండల తహశీల్దార్‌గా మల్లికార్జున్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. వనపర్తి జిల్లాలో డిప్యూటీ తహసీల్దారుగా సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు.

Update: 2024-09-21 04:33 GMT

దిశ, గద్వాల టౌన్ : గద్వాల మండల తహశీల్దార్‌గా మల్లికార్జున్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. వనపర్తి జిల్లాలో డిప్యూటీ తహసీల్దారుగా సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు. ఇటీవల తహసీల్దార్ గా పదోన్నతి పొందారు. శుక్రవారం గద్వాల తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇన్చార్జి తహసీల్దార్ కరుణాకర్ నూతన తహసీల్దార్ మల్లికార్జున్ కు బాధ్యతలు అప్పగించారు. డిప్యూటీ తహసీల్దార్ శివకుమార్, ఆర్ఐలు శ్రీనివాసులు, మదన్, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మదనపల్లి సర్పంచ్ టి కృష్ణ, చెనుగొనిపల్లి గుర్రం వెంకటేష్, ఆటో కృష్ణ, తదితరులు నూతన తహసీల్దార్ మల్లికార్జున్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.


Similar News