మక్తల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు - కర్ణాటక ఎమ్మెల్సీ హేమలత నాయక్
నియోజకవర్గలో బీజేపీ పార్టీ పాలన రావాలని, కుటుంబ పాలనకు స్వస్తి పలకాలని ప్రజలు ఆకాంక్షిస్తు న్నారని కర్ణాటక కొప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్సీ హేమలత నాయక్ అన్నారు.
దిశ మక్తల్ : నియోజకవర్గలో బీజేపీ పార్టీ పాలన రావాలని, కుటుంబ పాలనకు స్వస్తి పలకాలని ప్రజలు ఆకాంక్షిస్తు న్నారని కర్ణాటక కొప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్సీ హేమలత నాయక్ అన్నారు.నియోజకవర్గంలో గత ఐదు రోజులుగా ఐదు మండలాల్లో ప్రభాస్ యోజన కార్యక్రమాలను నిర్వహించామని ఇక్కడ అంతా బీజేపీకి అనుకూలంగా ఉందన్నారు.ముగింపు కార్యక్రమాల్లో భాగంగా పట్టణంలో నల్లజానమ్మ మందిరం నుండి పడమటి ఆంజనేయ స్వామి ఆలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలకై నిధులు మంజూరి చేసిన, కేసీఆర్ ప్రభుత్వం పక్కదారి పట్టించారన్నారు. ఇళ్ళు లేని వారికోసం గర్ ఆవాస యోజన ఇళ్ళనిర్మాణంకై నిధులను మంజూరూ చేసిన డబుల్ బెడ్ రూమ్ లకి తరలించారన్నారు.
ప్రతి ఒక్కరికి వైద్యం అందించాలధని కేంద్ర ప్రభుత్వం పల్లె ధవఖానాల కోసం నిధులు కేటాయించిన అక్కడ మందుల సప్లై లేకుండా నిర్విర్యంచేస్తున్నరన్నారు.నియోజకవర్గంలో అన్ని మండలాల మారుమూల గ్రామాల నుండి మండల నియోజకవర్గ కేంద్రానికి రోడ్ల సౌకర్యం లేక, పల్లెలో మౌలిక వసతుల కల్పన కరువై ప్రజలు ఇబ్బందులు పడుతున్నరన్నారు. రైతులకు నాణ్యమైన కరెంటు లేదని, కల్తి విత్తనాలతో రైతుల నష్టపోతున్నారని పేర్కోన్నారు.కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి రైతులు, ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆమె అన్నారు.
మక్తల్ నియోజకవర్గంలో వర్గ బేధాలు లేవని, నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీలో తను కూడా ఉంటానని అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థి గెలుపుకు అందరం కృషిచేస్తామని జలంధర్ రెడ్డి అన్నారు. ఈకార్యక్రమంలో కర్నాటక కోప్పల్ నియోజక వర్గం ఎమ్మెల్సీ హేమలత నాయక్, శుభాష్ చందర్, రాష్ట్రకార్య వర్గ సభ్యుడు జలందర్ రెడ్డి, జిల్లానాయకులు భాస్కర్, మంథన్ గోడు వెంకట్రాములు, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.