MLA Vakiti Srihari : చదువు వ్యక్తి అభివృద్ధికి బాట చూపిస్తుంది..

చదువు నేర్చుకోవడం వల్ల జీవితంలో స్థిరపడటానికి బాట చూపిస్తుందని, చదువు ఈడు కలిగిన పిల్లలను బడికి పంపించాలని మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు.

Update: 2024-10-28 09:48 GMT

దిశ, మక్తల్ : చదువు నేర్చుకోవడం వల్ల జీవితంలో స్థిరపడటానికి బాట చూపిస్తుందని, చదువు ఈడు కలిగిన పిల్లలను బడికి పంపించాలని మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం మండలంలోని ఎర్నాగన్ పల్లి గ్రామంలో మూతపడిన బడిని ఎంఈఓ అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ( MLA Vakiti Srihari ) ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా మక్తల్ మండలంలోని ఎర్నాగానిపల్లె విద్యాధికారుల పర్యవేక్షణ లేక మూతపడ్డంతో గ్రామంలోని పిల్లలు పక్క గ్రామంలోకి చదువుకోడానికి వేళ్ళిపోయారని అన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలానికి విద్యాధికారిని నియమించిందన్నారు. మండలంలో టీచర్ల కోరతతొ మూతపడిన పాఠశాలలను తెరిపించాలని, మండల విద్యాధికారి శ్రద్ధ తీసుకొని మక్తల్ ఎమ్మెల్యేతో మాట్లాడి గ్రామ పెద్ధలతో సమావేశమై అంగికారంతో ఎర్నాగన్ పల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పునఃప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ ఎలా తీర్చిదిద్దాలి అనేది ఉపాధ్యాయుల మీదనే ఉంటుందన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని వారికి మెరుగైన విద్య అందేలా చూడాలని తల్లిదండ్రులను కోరారు. ఈ అవకాశాన్ని అందరూ పిల్లలు, తల్లిదండ్రులు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేశారు. పాఠశాలకు కాంపౌండ్ వాల్ లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్ళగా పాఠశాలకు ప్రహరీ గోడను ఏర్పాటు చేయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల టీచర్లు, గ్రామ పెద్దలు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News