రాఖీ పౌర్ణమి ఆదాయంలో ఆర్టీసీ ఆల్ టైం రికార్డు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆర్టీసీ ఆదాయ సముపార్జనలో తన రికార్డులను తానే చెరిపేసుకొని, కొత్త రికార్డులను సృష్టించుకుంటుంది.

Update: 2024-08-21 04:22 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆర్టీసీ ఆదాయ సముపార్జనలో తన రికార్డులను తానే చెరిపేసుకొని, కొత్త రికార్డులను సృష్టించుకుంటుంది. ఈ సందర్భంగా జిల్లా ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ఆర్ఎం శ్రీదేవి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. రాఖీ పౌర్ణమి సందర్భంగా సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 ఆర్టీసీ డిపోల బస్సులను 3 లక్షల 71 వేల కిలోమీటర్ల నడిపి, 5 లక్షల 84 వేల మంది ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరవేసి, 131 శాతం ఓఆర్‌ను నమోదు చేసుకొని, 2 కోట్ల 88 లక్షల రూపాయల ఆదాయాన్ని రాబట్టి చెరిగిపోని సరికొత్త రికార్డు నెలకొల్పామని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. గత ఏడాది ఆగస్టు 31 రాఖీ పౌర్ణమి సందర్భంగా 3.59 లక్షల కిలోమీటర్ల తిప్పి, కోటి 99 లక్షల ఆదాయం రాగా, ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమికి 89 లక్షల అదనపు ఆదాయాన్ని ఆర్జించామని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఇంతటి ఘనత సాధించడం ప్రయాణికులు తమపై ఉంచిన విశ్వాసం, సిబ్బంది పనితీరుకు నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించారు.


Similar News