MLA : పాలమూరు యూనివర్సిటీ లో లా, ఇంజనీరింగ్ కళాశాలల స్థల పరిశీలన

హైదరాబాద్ లో శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మహబూబ్ నగర్ కు ప్రభుత్వ 'ఇంజనీరింగ్' అండ్ 'లా' కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం లభించగానే,

Update: 2024-10-29 12:13 GMT

దిశ, ప్రతినిధి, మహబూబ్ నగర్: హైదరాబాద్ లో శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మహబూబ్ నగర్ కు ప్రభుత్వ 'ఇంజనీరింగ్' అండ్ 'లా' కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం లభించగానే, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) ఆ రెండు కళాశాలల స్థాపనకు స్థల పరిశీలన వేట మొదలుపెట్టారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో వీసీ శ్రీనివాస్(VC Srinivas) తో కలిసి స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన లా కాలేజీ, ఇంజనీరింగ్ కళాశాల పక్కా భవనాల కోసం స్థలాన్ని ఎంపిక చేసి త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఆయన తెలిపారు. గత అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ 'లా' కాలేజీ, ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటుకు ఎన్నో వినతులు వచ్చినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. గత పది నెలలుగా విద్యారంగం పై తాము పడిన శ్రమకు ఫలితం దక్కిందని, యూనివర్సిటీలో అన్ని బ్రాంచీలు ఉంటే దానికి యూజీసీ లో రేటింగ్ పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో రెండు యూనివర్సిటీలకు మాత్రమే కేంద్రం వంద కోట్ల నిధులు ఇచ్చిందని, సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు పై ప్రత్యేక శ్రద్ధ చూపినందునే అందులో ఒకటి మనకు వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంబడి మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, పీయూ రిజిస్ట్రార్ లు ఉన్నారు.


Similar News