Deputy Chief Minister : సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే విజయవంతంగా నిర్వహించాలి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే( household survey) విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క( Deputy Chief Minister) అన్నారు.
దిశ, గద్వాల కలెక్టరేట్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే( household survey) విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క( Deputy Chief Minister) అన్నారు. మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా మధిర తహసీల్దార్ కార్యాలయం నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి( State Chief Secretary Shanti Kumari), ఇతర ఉన్నత అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్( Video conference) ద్వారా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై సమీక్షించారు.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు తయారు చేసిన ప్రణాళిక, సర్వే ఉద్దేశం, జిల్లా స్థాయిలో కలెక్టర్ లు తీసుకోవాల్సిన చర్యలు మొదలగు అంశాలను ఉప ముఖ్యమంత్రి వివరించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ...సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ) నిర్వహణ విధి విధానాలను క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించామని అన్నారు. ఈ సర్వేలో ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి రాజకీయ, కుల వివరాలను సేకరిస్తామని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఉన్నతమైన ఆలోచనతో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపడుతుందని, ఎస్సీ, ఎస్టీ ఇతర బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వివిధ సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ అవకాశాల వారికి మెరుగు పరచడానికి తగిన ప్రణాళికలు తయారు చేసేందుకు
ఈ సర్వే ఉపయోగిస్తామని ఉప ముఖ్యమంత్రి అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులతో మాట్లాడుతూ...సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు అవసరమైన ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్ లను గుర్తించి వారికి అవసరమైన శిక్షణ అందించాలని, గ్రామం మండల, జిల్లా సాయి ప్రభుత్వ అధికారులను ఎంపిక చేసి వారి సేవలను తీసుకోవచ్చని అన్నారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు ప్రతి మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారులు నోడల్ అధికారిగా నియమించాలని, ఎన్యుమరేటర్ సూపర్వైజర్ లకు అవసరమైన శిక్షణ అందించాలని అన్నారు.
సర్వే నిర్వహణకు అవసరమైన ఫారంలు మార్గదర్శకాలు ముద్రణ స్టేషనరీ ఏర్పాట్లు చేయాలని, ఇండ్ల జాబితా చేపట్టాలని అన్నారు. సర్వే షెడ్యూల్ వివరాలు ప్రజలకు చేరేలా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, నవంబర్ 6 నుంచి సర్వే ప్రారంభించాలని, సర్వే చేస్తున్న సమయంలో కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ధరణి పాస్ పుస్తకాలు కుటుంబం దగ్గర ఉంచుకునేలా విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. సర్వే వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసేందుకు డాటా ఎంట్రీ ఆపరేటర్లను గుర్తించాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, జడ్పీ సీఈఓ కాంతమ్మ, జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికారి సరోజ, బీసీ సంక్షేమ శాఖ అధికారి రమేష్ బాబు, మత్స్య శాఖ అధికారి షకీలా భాను, జిల్లా మార్కెటింగ్ అధికారి పుష్పము, ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ ప్రియాంక, రవాణాశాఖ అధికారి వెంకటేశ్వరరావు, గద్వాల మున్సిపల్ కమీషనర్, తదితరులు పాల్గొన్నారు.