అవినీతి బీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడుదాం: దిలీపాచారి
తెలంగాణ ప్రజలంతా ఏకమై బీఆర్ఎస్ అసమర్థ, అవినీతి ప్రభుత్వానికి చరమగీతం పాడాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇంచార్జి నెడనూరి దిలీపాచారి అన్నారు.
దిశ, బిజినేపల్లి: తెలంగాణ ప్రజలంతా ఏకమై బీఆర్ఎస్ అసమర్థ, అవినీతి ప్రభుత్వానికి చరమగీతం పాడాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇంచార్జి నెడనూరి దిలీపాచారి అన్నారు. మండలంలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహిస్తున్న ఉద్యోగ నియామక పరీక్ష పత్రాల లీకేజీల వల్ల నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. లీకేజీలకు ప్రభుత్వం బాధ్యత వహించడమే కాకుండా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే ఉద్యోగ అభ్యర్థులకు రూ. లక్ష చొప్పున నష్టపరిహారం అందించడంతో పాటు సిట్టింగ్ జడ్జితో పారదర్శకంగా విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మంగళవారం బీజేపీ అధ్వర్యంలో మహబూబ్ నగర్ లో లక్షమందితో నిర్వహించనున్న నిరుద్యోగ మార్చ్ కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని చెప్పారు. ఈ మార్చ్ లో నిరుద్యోగులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్చ జిల్లా అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్, మండల అధ్యక్షుడు భూషయ్య, మండల ప్రధాన కార్యదర్శులు కడారి కృష్ణ. బాలస్వామి, భూపతిసాగర్, తిరుపతి నాయక్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.