బాల్యవివాహాలను ప్రోత్సహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
బాల్యవివాహలను ప్రోత్సహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ లో ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి అన్నారు.
దిశ నారాయణపేట ప్రతినిధి : బాల్యవివాహలను ప్రోత్సహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ లో ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని దామరగిద్ద, నారాయణపేట మండలంతో పాటు.. పట్టణానికి చెందిన మొత్తం ౩౬౬ మంది లబ్ధిదారులకు ఆర్డివో కార్యాలయంలో ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తల్లిదండ్రులు ఆడబిడ్డను భారంగా భావించరాదని తెలిపారు. వారిని ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులను చేయాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్ లను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఆర్డివో రాంచందర్ రావ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ అనసూయ, వైస్ చైర్మన్ హరినారాయణ భట్టడ్, 9 వ వార్డు కౌన్సిలర్ మహేష్ ,ఆయా మండలాల తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందుగా ఎమ్మెల్యే లింగంపల్లి వద్ద భాగ్యలక్ష్మి మిల్ లో CCI పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, రైతులకు సహకరించాలని, ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అలాగే మరికల్ గ్రామంలో సమగ్ర ఇంటింటి సర్వేను పరిశీలించి, ప్రతి ఒక్కరు ఎన్యూమరేటర్లకు సహకరించి వివరాలు నమోదు చేయించాలన్నారు.