ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే ప్రశ్నాపత్రాల లీక్: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నందున క్రెడిట్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి పోతుందని రాష్ట్రప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు బీజేపీ నాయకులు కార్యకర్తలతో కుట్రపూరితంగా టీఎస్పీఎస్సీ, పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీలకు పాల్పడుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి ఆరోపించారు.

Update: 2023-04-05 12:07 GMT

దిశ, జడ్చర్ల: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నందున క్రెడిట్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి పోతుందని రాష్ట్రప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు బీజేపీ నాయకులు కార్యకర్తలతో కుట్రపూరితంగా టీఎస్పీఎస్సీ, పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీలకు పాల్పడుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి ఆరోపించారు. బుధవారం జడ్చర్లలోని ఎమ్మెల్యే తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లిక్కర్, లీకేజీ వ్యవహారాల గురించి ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని చెప్పారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వెనుక బండి సంజయ్ పాత్ర ఉందని తెలిసి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు.

లిక్కర్ స్కాంకు సంబంధించి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణల్లో అర్థం లేకుండా ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ రాష్టంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జడ్పీ వైస్ చైర్మన్ కొడగల్ యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు సతీష్, నందకిషోర్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, బాద్మి శివ కుమార్, పిట్టల మురళి, శ్రీకాంత్ ఇంతియాజ్ ఖాన్, శ్రీశైలం యాదవ్, రామ్మోహన్ తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News