పనిచేసే ప్రభుత్వానికి రుణపడి ఉండాలి

ప్రభుత్వం నుండి సహాయం పొంది ప్రభుత్వ పథకాలను పొందిన లబ్ధిదారులు పనిచేసే ప్రభుత్వానికి రుణపడి ఉండాలని సహాయం అందించిన ప్రభుత్వానికి రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని ఆ రుణాన్ని వచ్చే ఎన్నికల్లో తమ ఓటు ద్వారా తీర్చుకోవాలని మాజీ మంత్రి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు.

Update: 2023-09-27 17:23 GMT

దిశ, మిడ్జిల్ : ప్రభుత్వం నుండి సహాయం పొంది ప్రభుత్వ పథకాలను పొందిన లబ్ధిదారులు పనిచేసే ప్రభుత్వానికి రుణపడి ఉండాలని సహాయం అందించిన ప్రభుత్వానికి రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని ఆ రుణాన్ని వచ్చే ఎన్నికల్లో తమ ఓటు ద్వారా తీర్చుకోవాలని మాజీ మంత్రి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం మిడ్జిల్ మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మండలంలోని 46 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలు పేదంటి ఆడబిడ్డలు తల్లిదండ్రులు భరోసా అన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా కుల, మత, వర్గ పార్టీ ప్రాంతీయ భేదాలు లేకుండా నిరుపేదలకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం వర్తింపజేస్తున్నట్లు గుర్తు చేశారు.

రానున్న రోజుల్లో పేద ప్రజల కోసం మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు రానున్నాయని తెలంగాణ దేశంలో అన్ని రంగాల్లో ముందంజలో ఉందని అన్నారు. పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని అన్నారు. ఇందులో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రతి లబ్ధిదారుడు ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మిడ్జిల్ ఎంపీపీ సుదర్శన్, జెడ్పీటీసీ శశిరేఖ పాలు, వైస్ ఎంపీపీ తిరుపతమ్మ, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు జంగారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పాండు యాదవ్, సర్పంచులు రాధిక వెంకట్ రెడ్డి, నారాయణరెడ్డి, సంయుక్తరాణి, మల్లమ్మ, రాధిక , సునీత మంజుల మార్కెట్ డైరెక్టర్లు కాడయ్య వీరారెడ్డి పలువురు టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News