నవోదయలో 9, 11 తరగతులలో ప్రవేశానికి దరఖాస్తు ఆహ్వానం..
మండల పరిధిలోని వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో 2025 - 2026 విద్యా సంవత్సరం 9వ తరగతి, 11వ తరగతులలో ఖాళీగా వున్న సీట్లలో ప్రవేశానికి గాను అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్ లైన్ లో ఈ నెల 30 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవలసిందిగా ప్రిన్సిపాల్ పి.భాస్కర్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు.
దిశ, బిజినేపల్లి : మండల పరిధిలోని వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో 2025 - 2026 విద్యా సంవత్సరం 9వ తరగతి, 11వ తరగతులలో ఖాళీగా వున్న సీట్లలో ప్రవేశానికి గాను అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్ లైన్ లో ఈ నెల 30 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవలసిందిగా ప్రిన్సిపాల్ పి.భాస్కర్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు. ఉమ్మడి జిల్లాలోని విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని, 2025 -2026 విద్యా సంవత్సరానికి గాను 9వ తరగతిలో ప్రవేశానికి ప్రవేశ పరీక్షకు హాజరు కాబోయే అభ్యర్థులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతూ 01.05.2010 నుండి 31.07.2012 తేదీల మధ్య జన్మించి ఉండవలెనని తెలిపారు. 11వ తరగతిలో ప్రవేశం కోరే విద్యార్థులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చదువుతూ 01.06.2008 నుండి 31.07.2010 తేదీల మధ్యలో జన్మించి ఉండవలెనని పేర్కొన్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఏదేని ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న బాలబాలికలు ఉచితంగా www.navodaya.gov.in ద్వారా ఆన్ లైన్ లో భాస్కర్ కుమార్ కోరారు. అలాగే వారి తల్లిదండ్రుల నివాసం ఉమ్మడి జిల్లాలోనిదై వుండాలని, రెండు తరగతుల ప్రవేశ పరీక్ష 08.02.2025 న నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని అర్హులైన ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు కృషి చేయాలని వారు కోరారు.