బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి కేటీఆర్,హరీశ్‌రావు పరామర్శ
నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులను మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీష్ రావు పరామర్శించారు.
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులను మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఇటీవల మర్రి జనార్దన్ రెడ్డికి పితృవియోగం జరిగిన నేపథ్యంలో..హరీష్ రావు, కేటీఆర్, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ శసి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి,బీరం హర్షవర్ధన్ రెడ్డి,రాజేందర్ రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్ తదితరులు మంగళవారం మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి స్వగ్రామం తిమ్మాజీపేట మండలం నేరేళ్లపల్లికి వచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీశ్వరరావు తదితరులు మర్రి జనార్దన్ రెడ్డి తండ్రి మర్రి జంగి రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మర్రి,పైన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కాగా హరీష్ రావు, కేటీఆర్ రాక సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి పలువురు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తరలి వచ్చారు.