Sangameshwara temple : సంగమేశ్వర ఆలయ శిఖరాన్ని తాకిన కృష్ణమ్మ అలలు

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల కృష్ణానది తీరంలోని సప్త నదుల సంగమ ప్రదేశంలో ఉన్న అతి ప్రాచీన సంగమేశ్వర ఆలయ శిఖరాన్ని గురువారం సాయంత్రం కృష్ణా జలాలు తాకాయి.

Update: 2024-07-25 15:21 GMT

దిశ, కొల్లాపూర్ : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల కృష్ణానది తీరంలోని సప్త నదుల సంగమ ప్రదేశంలో ఉన్న అతి ప్రాచీన సంగమేశ్వర ఆలయ శిఖరాన్ని గురువారం సాయంత్రం కృష్ణా జలాలు తాకాయి. ఎగువన జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రభావం రావడంతో ప్రాజెక్టులోని 46 గేట్లను అధికారులు ఎత్తి దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని వదిలారు. దీంతో ఉధృతంగా కృష్ణానదికి వరద పోట్టెత్తుతుంది. గంట గంటకు నదికి ఎగువ నుంచి వరద ప్రవాహం పెరగడంతో నదిలో చేపలు పట్టేందుకు వెళ్లనీయకుండా జాలర్లను అధికారులు అప్రమత్తం చేశారు. శుక్రవారం ఉదయం కల్లా సంగమేశ్వర స్వామి ఆలయ శిఖరం జలాధివాసం కానున్నదని ఆలయ ప్రధాన పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ తెలిపారు.


Similar News