బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు సరికాదు: మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి
జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు అక్రమంగా కేసులు పెడుతున్నారు.
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు అక్రమంగా కేసులు పెడుతున్నారు. సదరు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ మేరకు గురువారం రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌లు హైదరాబాద్‌లో రాష్ట్ర డిజిపి జితేందర్ కలిసి వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో బీఆర్ఎస్ నాయకులపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ.. ఆధారాలు లేకుండా.. ఫిర్యాదులు చేయగానే కేసులు నమోదు చేస్తున్నారని.. ఇది సరికాదని, ఇటువంటి చర్యలను ఆపాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, సర్పంచ్‌లు సంఘం జేఏసీ అధ్యక్షుడు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.