అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం.. కసిరెడ్డి నారాయణరెడ్డి

అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కల్వకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు.

Update: 2023-11-08 16:46 GMT

దిశ, వెల్దండ : అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కల్వకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం వెల్దండ మండలం జూపల్లి, నెమలిగుండు తండా, దొంగలగుట్ట తండా, సిల్లోనిబండ తండా, జేపల్లి, ఎర్రవల్లి, గోకారం, చంద్రాయిని పల్లి గ్రామాలలో కసిరెడ్డి నారాయణరెడ్డి ఇంటింటికి ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న 6 గ్యారంటీ పథకాల పై నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ శ్రీ ఠాగూర్ బాలాజీ సింగర్, వెల్దండ మండల నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత అంతా ఏకతాటి పై వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలుపుకై ప్రతి ఒక్కరు సైనికుల వలే పోరాడి కల్వకుర్తిలో కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలని సూచించారు. కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు.

తండాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయని వాటిని అభివృద్ధి చేయాల్సిన పాలకులు సరిగా పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రజలు కోరుకున్నట్లుగా గ్రామాల్లో అభివృద్ధి జరగలేదన్నారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు చేతి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కల్వకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని, రాష్ట్రంలో అగ్రభాగానా నిలబెడతానన్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కశిరెడ్డి నారాయణరెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు. పార్టీ విజయం కోసం పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెల్డండ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

Tags:    

Similar News