దిశ నాగర్ కర్నూల్ : అక్టోబర్ లోపు సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్ ) లక్ష్యాన్ని పూర్తి చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ కే సీతారామారావు రైస్ మిల్లర్లకు ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ లో రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులతో 2023-24 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి సీఎంఆర్ రైస్ డెలివరీ పై అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ… రైస్ మిల్లులకు సీఎంఆర్ కింద కేటాయించిన ధాన్యాన్ని త్వరిత గతిన మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకు బియ్యం నిల్వలు అందించేలా సహకరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన గడువు సెప్టెంబర్ 30లోగా సీఎంఆర్ డెలివరీ చేయాలని ఆదేశించారు. ప్రతిరోజు ప్రతి రైస్ మిల్ రెండు ఎసికెల బియ్యాన్ని అందజేయాలన్నారు.