ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరికలు..

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో 40 మంది బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు..

Update: 2023-01-20 06:51 GMT

దిశ,దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో దేవరకద్ర పట్టణంలోని రైల్వే స్టేషన్ ఏరియాకు సంబందించిన 13, 14 వార్డులకు చెందిన వివిధ పార్టీలకు చెందిన 40 మంది కార్యకర్తలు స్థానిక నాయకులు కొండా భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు, పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు బీఆర్ఎస్ పార్టీతోనే న్యాయం జరుగుతున్నదని ప్రజలు విశ్వసిస్తున్నారని ప్రతి ఒక్క కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండానే శ్రీరామరక్షా అని అన్నారు. శ్రమించి పనిచేసే ప్రతి కార్యకర్తకి తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసి ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలియజేశారు. పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కలిగి ఉన్న ప్రతి కార్యకర్త కుటుంబానికి రెండు లక్షల రూపాయల భీమా సదుపాయం కల్పించామన్నారు. ఆసరా పెన్షన్ రైతుల కోసం రైతుబంధు 24 గంటల ఉచిత విద్యుత్ పేదల కోసం కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ వంటి పథకాలను అర్హులైన ప్రజలకు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర మండల పార్టీ అధ్యక్షులు జెట్టి నరసింహా రెడ్డి, మాజీ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్, ముడా సభ్యులు కర్ణం రాజు, పీఎసిఎస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ కొండా శ్రీనివాస్ రెడ్డి, మాజీ దేవస్థానం కమిటీ చైర్మన్ కొండా భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ లు ఉమ్మిగారి వెంకటేష్, ఉస్కిల వెంకట్రాములు, మండల నాయకులు చల్మా రెడ్డి, మున్నూరు బాల్ రాజు, మెడికల్ రాము, కొండల్ మరియు యువ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News