ఐపీఎల్ షురూ..!! జర జాగ్రత్త గురూ..!!
ఐపీఎల్ అంటేనే ఎమక్రైజ్ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో క్రికెట్ పై బెట్టింగ్ పెడుతూ యువత ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.

దిశ, రేవల్లి : ఐపీఎల్ అంటేనే ఎమక్రైజ్ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో క్రికెట్ పై బెట్టింగ్ పెడుతూ యువత ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అదే విధంగా గత ఏడాది పలువురు బెట్టింగ్ రాయుళ్ల పై కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ పై మోజు పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. బెట్టింగ్ అని వచ్చే వారితో యువత జాగ్రత్తగా ఉండాలని బెట్టింగ్ పెడదాం అనేవారు ఎవరైనా ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని దీనికి తోడు బెట్టింగ్ పాల్పడితే కఠినమైన చర్యలు ఉంటాయని పోలీసులు పదేపదే చెప్తున్నా కూడా యువత దీనిని పెడచెప్పిన పెడుతుంది. అదే విధంగా ఎక్కువగా పల్లెలోనే ఈ సమస్య పట్నం వరకు వైరస్లా వ్యాపిస్తుంది. అక్కడక్కడ గ్రూపులుగా ఏర్పడి ఎవరికి తెలియకుండా సోషల్ మీడియాను వాడుతూ బెట్టింగ్ పాల్పడుతున్నారని వినికిడి. ఏది ఏమైనా అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకొని తర్వాత వారికి మరణమే శాపంగా మారింది. రోజుకు కనీసం 10,000 నుంచి 1 లక్ష రూపాయల వరకు బెట్టింగ్ జరగొచ్చు అనే సమాచారం బహిరంగనే వినిపిస్తుంది.
విచిత్రమైన కోడు భాషలో ఉపయోగిస్తూ..
ఈ మధ్య కొత్తగా కోడు భాషతో అర్థం కాకుండా తమ బెట్టింగ్ పనులను ఈజీగా ఉపయోగిస్తున్నారు. ఆ భాష ప్రకారమే బెట్టింగ్లు పెడుతున్నారు. అదేవిధంగా సెల్ఫోన్ ,సోషల్ మీడియా ఎక్కువగా వాడుకొని బెట్టింగ్లకు పాల్పడుతున్నారు యువత.
మ్యాచ్ టాస్ వేసిన మొదలు బంతి బంతికి..
మరో కొత్త రకం బెట్టింగ్ అమల్లోకి వచ్చింది. మ్యాచ్ ప్రారంభమైన అప్పటి నుండి ప్రతి ఓవర్లు ప్రతి బంతికి ఒక నిబంధనను ఏర్పాటు చేసుకొని కొత్త రకం బెట్టింగ్ మొదలు. అయితే పలానా బంతిలో పలానా ఓవర్లు సిక్స్ లేదా ఫోర్ కొడతాడు అనే కొత్త నిబంధనతో బెట్టింగ్ మరింత జోరు పెంచింది. ఈ బెట్టింగ్ కు యువత ఎక్కువ మోజు చూస్తున్నట్లు సమాచారం.
ఐపీఎల్ బెట్టింగ్ యువత పై ప్రభావం, బానిసలుగా మారుతున్న యువత..
ఈ ఐపీఎల్ బెట్టింగ్ కు ఎక్కువగా యువత బానిసలుగా మారుతున్నారు. స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండడంతో ఈ బెట్టింగ్ పాల్పడి వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. దీని ఉచ్చులో పడి ఆత్మహత్యలు చేసుకొని కుటుంబాలకు దూరమైన వారి జీవితాలు చిన్న భిన్నమైన ఘటనలు చాలానే ఉన్నాయి. ఈ సారి పోలీసులు ఈ బెట్టింగ్ల పై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
ఐపీఎల్ ప్రభావం ఎంత అంటే..?
ఈ ఐపీఎల్ కేవలం చదువుకున్న వాళ్ళు మాత్రమే దీనికి బానిస అవుతారని విన్నాం కానీ చదువురాని మొదలు కూలినాలి చేసుకునే వరకు ఈ ఐపీఎల్ ప్రభావం వైరస్ లా పాకి వారి జీవితాలకు పెద్ద సమస్యను తెచ్చిపెడుతుంది. ఆఖరికి ఇంట్లో ఉన్న వస్తువులు కూడా అమ్మి బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. అనేది బహిరంగనే వినపడుతున్న మాట చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఐపీఎల్ బెట్టింగ్ కు బానిసలై అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటే ఆ కుటుంబాలు పడే బాధ అంతా ఇంతా కాదు.
బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అని రేవల్లి ఎస్ఐ రాము..
యువత ఐపీఎల్ బెట్టింగ్ పాల్పడవద్దని క్రమశిక్షణతో మంచిగా చదివి ఉన్నత స్థాయిలకు ఎదగాలని రేవల్లి మండల ఎస్సై రాము అన్నారు. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని తెలిపారు. అదేవిధంగా బెట్టింగ్లకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని అదేవిధంగా పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు.