District SP: పోలీస్ అమరవీరుల షార్ట్ ఫిల్మ్ పోటీలకు ఆహ్వానం

అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల దినోత్సవం 'పోలీస్ ఫ్లాగ్ డే' సందర్భంగా పోలీస్ సంబంధిత అంశంపై షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి తెలిపారు.

Update: 2024-10-11 15:04 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల దినోత్సవం 'పోలీస్ ఫ్లాగ్ డే' సందర్భంగా పోలీస్ సంబంధిత అంశంపై షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. ఫోటోగ్రఫీ,షార్ట్ ఫిల్మ్ తీయడానికి జిల్లాలో ఆసక్తి గల ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రధానంగా పోలీస్ త్యాగాలు, విధుల్లో కనబరిచిన తెగువ, మూఢనమ్మకాలు ఇతర సామాజిక రుగ్మతలు, అత్యవసర సమయంలో పోలీసుల స్పందన లాంటివి, అలాగే ప్రకృతి వైపరీత్యాల్లో పోలీసుల సేవలు, సైబర్ నేరాల నివారణ, ఈవ్ టీజింగ్, షీ టీమ్స్, మత్తు పదార్థాల వాడకం వల్ల అనర్థాలపై 10×8 సైజ్ ఫోటోలను, 3 నిమిషాల షార్ట్ ఫిల్మ్ ను సిడీ లో లేదా పెన్ డ్రైవ్ లో వేసి తమ పూర్తి వివరాలతో‌,తమ సమీప పోలీస్ స్టేషన్ లో కానీ,మహబూబ్ నగర్ డీఎస్పీ కార్యాలయంలో కానీ ఈ నెల 20 వ తేదీ లోపు అందజేయాలని ఆమె సూచించారు.


Similar News