జాతీయ పతాకానికి అవమానం.. ఆలస్యంగా వెలుగులోకి
నాగర్ కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలం, వట్టెం గ్రామంలో గల

దిశ,బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలం, వట్టెం గ్రామంలో గల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జాతీయ పతాకానికి అవమానం జరిగింది. పాఠశాలకు సంబంధించిన పాత గదులను కూల్చి నూతనంగా గదులను నిర్మిస్తున్నారు. గతంలో దాతలు బహూకరించిన 100 మీటర్ల జాతీయ పతాకాన్ని తరగతుల కోసం అని పరదాగా ఏర్పాటు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ బాగా వైరల్ అయింది. ఈ విషయమై మండల విద్యాధికారి రఘునందన్ రావు ను వివరణ కోరగా తెలియకపోవడంతో ప్రధానోపాధ్యాయులు పరదాగా ఉపయోగించారు. ఈ విషయంపై మళ్లీ పునరావతం అవుతే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు .