అజిలాపూర్ ప్రజల దశాబ్దాల కళకు మోక్షం..

అడవి అజిలాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ కు 32 కోట్ల ఐదు లక్షల రూపాయల నిధులను శనివారం మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

Update: 2025-03-22 15:43 GMT
అజిలాపూర్ ప్రజల దశాబ్దాల కళకు మోక్షం..
  • whatsapp icon

దిశ, దేవరకద్ర : అడవి అజిలాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ కు 32 కోట్ల ఐదు లక్షల రూపాయల నిధులను శనివారం మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో అడవి అజిలాపురం ప్రజల దశాబ్దాల కళకు మోక్షం లభించింది. దేవరకద్ర మండలంలో ప్రసిద్ధిగాంచిన కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు కూతవేటు దూరంలో ఉన్న అడవి జిల్లాపూర్ గ్రామానికి సాగునీరు రాక ఆ ప్రాంతం ఎడారిని తలపిస్తుండడంతో ప్రజల కష్టాలను చూసి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లి అజిలాపూర్ ప్రజల ఎన్నో సంవత్సరాల కలయినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ సాధించారు. ఈ సందర్భంగా శనివారం ఎమ్మెల్యే జీఎంఆర్ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా జీవో అందుకున్నారు. అనంతరం రైతులు ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.


Similar News