Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు పోటెత్తిన భారీ వరద.. నిండనున్న ప్రాజెక్ట్

ఎగువ కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆల్మట్టి డ్యాం పూర్తిస్థాయిలో నిండుకుండలా తునికి లాడుతూ అక్కడ చాలా గ్రామాలు ముప్పు గురవుతున్నాయి.

Update: 2024-07-27 04:36 GMT

దిశ, అచ్చంపేట : ఎగువ కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆల్మట్టి డ్యాం పూర్తిస్థాయిలో నిండుకుండలా తునికి లాడుతూ అక్కడ చాలా గ్రామాలు ముప్పు గురవుతున్నాయి. అలాగే ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో దిగువన ఉన్న జూరాల ప్రాజెక్టు కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది. తద్వారా జూరాల ప్రాజెక్టు 46 గేట్లను ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు స్పిల్ వే ద్వారా 2 లక్ష 50 వేల 540 క్యూసెక్కులు అలాగే విద్యుత్ ఉత్పత్తి ద్వారా 19,668 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మొత్తం 3 లక్షల 43, 888 వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా శ్రీశైలం ప్రాజెక్టుకు 2 లక్షల 36 వేల 443 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు సామర్థ్యం 885 అడుగులు కాగా 215.87 టీఎంసీల సామర్థ్యం నీటి నిలువ ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో శనివారం ఉదయం నాటికి 863.40 అడుగులు చేరుకోగా 116.9200 టీఎంసీల సామర్థ్యం చేరుకుంది.

ఏపీ, టీజీ విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది..

శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఉన్న ఏపీ, తెలంగాణ రైట్, లెఫ్ట్ విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. ఏపీ విద్యుత్ కేంద్రం నుండి 25, 927 క్యూసెక్కుల నీటిని, తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుండి 31, 373 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వదులుతున్నారు. ఏపీ పంప్ హౌస్ నుంచి 6.908 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా తెలంగాణ పంప్ హౌస్ నుంచి 18. 087 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.


Similar News