ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం: ఎమ్మెల్యే బీరం

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.

Update: 2023-04-19 11:04 GMT

దిశ, వీపనగండ్ల: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని బొల్లారం తూముకుంట, సంగినేనిపల్లి వీపనగండ్ల గ్రామాలలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలోనే విక్రయించి మద్దతు ధర పొందాలని అన్నారు.

తరుగు, తేమ, నాణ్యత పేరుతో మిల్లర్లు రైతులను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కమలేశ్వరరావు, విండో చైర్మన్ రామన్ గౌడ్, వైస్ చైర్మన్ సరిత, రైతుబంధు సమితి కన్వీనర్ ఎతం కృష్ణయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, సీఈఓ రాము, సర్పంచులు వంగూర్ నరసింహారెడ్డి, పద్మమ్మ, రామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News