కాకతీయుల స్ఫూర్తి.. వనపర్తి‌కి కీర్తి

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్/ వనపర్తి : సాగునీరు.. ప్రజలకు అందుబాటులో పాలన అనే విధంగా రాజ్య పాలన చేసిన కాకతీయ రాజులు,

Update: 2022-03-07 07:53 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్/ వనపర్తి : సాగునీరు.. ప్రజలకు అందుబాటులో పాలన అనే విధంగా రాజ్య పాలన చేసిన కాకతీయ రాజులు, వారి సామంతుల పాలన స్ఫూర్తితో వనపర్తి జిల్లాలో నీటి వనరుల  ఏర్పాట్లతో వనపర్తి జిల్లా కీర్తి రాష్ట్ర స్థాయికి చేరుతోంది. స్వయాన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జిల్లా అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోంది. ప్రత్యేకించి వ్యవసాయ రంగం ఆధునిక పోకడలను సంతరించుకుంటోంది. అందుకు అవసరమైన నీటి వనరులను కల్పించడంలో మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన కృషి తో జిల్లాలో ఉన్న చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. కాకతీయుల కీర్తి కలకాలం నిలిచేలా వారి సామంత రాజు అయినా గోనగన్నారెడ్డి నిర్మించిన జిల్లా గణపురంలో ఉన్న గణపసముద్రం,   వంద సంవత్సరాల చరిత్ర లో కేవలం మూడు సార్లు అలుగు పారితే.. మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన కృషివల్ల గత రెండు మూడు సంవత్సరాల నుండి నిరంతరం అలుగు పారుతోంది. వేసవిలోనూ నిండుకుండలా ఉండి.. అలుగు పారడం.. వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుండటంతో వ్యవసాయం ఆనందంగా సాగుతోంది.




 ప్రస్తుతము ఈ చెరువును రిజర్వాయర్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించిన నేపథ్యంలో మరో ఐదు నుండి పది వేల ఎకరాలకు సాగునీరు అందబో‌తుంది. జిల్లాలో జూరాల, కెఎల్ఐ నుండి వస్తున్న జలాలు వనపర్తి చెరువులు, కుంటలను నింపుతున్నాయి. సాగు నీరు అందని గ్రామాల కోసం ప్రత్యేక లిఫ్టు ఏర్పాటు చేసే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే కరివేన తాండ వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నారు.ఇక్కడ పండే వేరుశనగకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తోంది. రికార్డు స్థాయిలో దిగుబడి వస్తోంది. ప్రజలకు పరిపాలన చేరువయ్యేందుకు వీలుగా జిల్లా గా ఏర్పడిన వనపర్తి లో ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా సమీకృత కలెక్టరేట్ సముదాయం, వ్యవసాయ మార్కెట్ సముదాయం, మినీ ట్యాంక్ బండ్ లో ఏర్పాట్లు, రహదారుల విస్తరణ తదితరాలకు మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించనున్నారు. రానున్న కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మరింత అభివృద్ధి చెందిన చేందుకు వీలుగా మంత్రి నిరంజన్ రెడ్డి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు.



భారీ బహిరంగ సభ నిర్వహణ కోసం ఏర్పాట్లు

ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఉదయం 11గంటలకు హెకాకతీయుల స్ఫూర్తి- వనపర్తి కి  హెలికాప్టర్ ద్వారా వనపర్తి చేరుకుంటారు. ముందుగా చిట్యాల సమీపంలో ఉన్న మార్కెట్ యార్డు సముదాయాన్ని ప్రారంభించి జిల్లా కేంద్రం‌కు వస్తారు. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో మన ఊరు- మనబడి రాష్ట్రవ్యాప్త కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ నూతన భవనాన్ని ప్రారంభించి అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు. భోజన విరామం అనంతరం బహిరంగ సభ సమీపంలో ఏర్పాటు చేసిన కర్మకాండ ఎత్తిపోతల, మెడికల్, నర్సింగ్ కళాశాల, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, వేరుశనగ పరిశోధన కేంద్రాలకు శంకుస్థాపనలు, శిలాఫలకాలపై ఆవిష్కరణలు చేస్తారు. అనంతరం భారీ ఎత్తున నిర్వహించే బహిరంగ‌సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ఐదున్నర గంటలకు తిరిగి హెలికాప్టర్లో హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు.

Tags:    

Similar News