వీధి నాటకానికి రూ. 10 వేల ప్రోత్సాహక సహాయం అందించిన సతీష్ మాదిగ
గ్రామాల్లో అంతరించిపోతున్న వీధి నాటకాలు కళాపోషణను బతికిస్తున్న కళాకారుల మనుగడను.. Financial assistance
దిశ, ఉప్పునుంతల: గ్రామాల్లో అంతరించిపోతున్న వీధి నాటకాలు కళాపోషణను బతికిస్తున్న కళాకారుల మనుగడను కాపాడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఉప్పునుంతల మండలంలోని తాడూర్ గ్రామంలో నిర్వహించనున్న శ్రీ జగద్గురు మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి నాటక ప్రదర్శన నిర్వహణకు బీజేపీ అచ్చంపేట అసెంబ్లీ నాయకులు దేవని సతీష్ మాదిగ పదివేల రూపాయల ప్రోత్సాహక సహాయం అందించాలనే నిర్ణయంతో ఆయన ఆదేశించడంతో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కాకునూరి బ్రహ్మచారి, బీజేపీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు గుడెమోని శ్రీనివాస్ యాదవ్, గ్రామ అధ్యక్షులు గుడెమోని మలయ్య యాదవ్ లు నాటక మండలి సభ్యులకు నగదును అందజేశారు. కార్యక్రమంలో తిరుపతయ్య యాదవ్, మాజీ సర్పంచ్ కటికం చంద్రయ్య, తిమ్మారెడ్డి, కమ్మరి కృష్ణయ్య, నాటకా మండలి సభ్యులు, మరుపాకుల సైదులు, కుమ్మరి వెంకటయ్య, కాశన్న యాదవ్, బాలపిరు తదితరులు పాల్గొన్నారు.